పీ సీ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి 50 కేజిల బియ్యం అందజేత.
(అర్జున్ సమాచారం. ప్రతినిధి, ఆగస్టు 9.)
జన్నారం :పొనకల్ సుందరయ్య నగర్ కాలనీ లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన శని గారపు మహేష్ కుటుంబానికి పీసీఆర్ (పూర్ణచందర్రావు ) పౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున 50 కేజీల బియ్యన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఫజల్ ఖాన్, మున్వర్ అలీఖాన్, సులువ జనార్ధన్, ఇమ్రాన్, చింతల సతీష్, తదితరులు పాల్గొన్నారు